Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో కీలక మలుపు.. మామకి విడాకుల నోటీసు పంపించిన అత్త!
on Nov 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -581 లో.....కావ్య భోజనం తీసుకొని రావడంతో కావ్యకి టిప్పు ఇస్తుంటాడు రాజ్. నేనేం పరాయి వాళ్లకి భోజనం వండుకొచ్చానా.. నా వాళ్ళకే కదా అని కావ్య తనపై కోప్పడుతుంది. ఇక నుండి మా వాళ్ళకి భోజనం తీసుకొని రావాల్సిన అవసరం ఇక నీకు లేదు. నేనే ఒక చెఫ్ మాట్లాడాను. రేపటి నుండి వస్తుంది తనకి నెలకు లక్ష రూపాయలని రాజ్ చెప్తాడు. రాజ్ ఆ షెఫ్ గురించి గొప్పగా చెప్తుంటే.. అది ఎవతో రానివ్వు దాని వయ్యారం ఏంటో తేలుస్తానని ఇందిరాదేవి అంటుంది.
మరొకవైపు కళ్యాణ్ , అప్పు లు భోజనం చేస్తుంటారు. అప్పు వంక కళ్యాణ్ ప్రేమగా చూస్తుంటే.. ఎందుకు అలా చూస్తున్నావంటూ అడుగుతుంది. అన్నీ వదులుకొని నా కోసం వచ్చావ్.. నా కష్టసుఖాలలో తోడుంటున్నావని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ రుద్రాణిలు మాట్లాడుకుంటారు. ఆ కావ్యని ఎన్ని రకాలుగా ఆపాలని చుసినా వస్తూనే ఉందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి సీతారామయ్యలు భోజనం చేస్తుంటే.. రాజ్ నీక్కూడా కావ్య భోజనం తీసుకొని వచ్చింది. వచ్చి భోజనం చెయ్ అంటాడు. అవసరం లేదని రాజ్ అంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే రాజ్ వచ్చి భోజనం పెట్టుకుంటాడు. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరు వస్తారు. వాళ్ళని చూసి తినడం మానేస్తాడు రాజ్.
ఆ తర్వాత కావ్య ఇంటికి వస్తుంది. వాళ్లేం మాట్లాడుకుంటన్నారని రాజ్ వింటుంటాడు. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే రాజ్ ఏర్పాట్లు చేసిన షెఫ్ వస్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో అమ్మ నీకు విడాకుల నోటిస్ పంపిందని సుభాష్ కి రాజ్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఇదంతా నీ వళ్లేనే అని కావ్యపై రాజ్ కోప్పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read